Monday, December 23, 2024

మరదలిపై పోలీసు అత్యాచారం.. ఐదు సార్లు అబార్షన్

- Advertisement -
- Advertisement -

Cop booked for raping cousin over 5 years in karnataka

బెంగళూరు : ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ అధికారి వరసకు మరదలైన యువతిపై గత ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ ఘటన కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది. చల్లకేరే పోలీస్ స్టేషన్‌లో ఉమేష్ అనే వ్యక్తి సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆస్తిసమస్యను పరిష్కరించే ముసుగులో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఐదేళ్లుగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. అంతేగాక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్ మేనమామ కుమారుడని , వరుసకు బావ అవుతాడని పేర్కొంది. ఉమేష్ అయిదేళ్ల క్రితం దావణగెరె పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ బాధితురాలు నిందితుడిని సంప్రదించింది. ఈ కేసులో సాయం చేస్తున్నట్టు నటించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా పలు సందర్భాల్లో బాధితురాలిని బెదిరించి లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో యువతి ఐదు సార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించాడు. నిందితుడు ఉమేష్‌కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని , తనను మూడో పెళ్లి చేసుకుంటానని అతనున కోరుతున్నట్టు తెలిసింది. పెళ్లి చేసుకోకుంటే ఆస్తి తనకు దక్కకుండా చేస్తానని బెదిరిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక తన తల్లిదండ్రులను వీధుల్లోకి లాగుతానని, చెప్పినట్టు వినకుంటే చంపేస్తానని హెచ్చరిస్తున్నట్టు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడపై చిత్రదుర్గ మహిళా పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News