Wednesday, January 22, 2025

లంచం సొమ్ము మింగిన ఎస్‌ఐ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: లంచం పుచ్చుకుంటున్న ఒక ఎస్‌ఐని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా లంచం సొమ్మును మింగి సాక్ష్యాలను నాశనం చేయడానికి ఎస్‌ఐ ప్రయత్నించిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఒక ఎద్దు చోరీ కేసులో రూ. 30 వేల లంచం అడిగిన ఫరీదాబాద్ ఎస్‌ఐ మహేందర్ పాల్ అందులో భాగంగా రూ. 6వేల లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు ఒక పెళ్లిలో పట్టుకున్నారు.

అయితే లంచం సొమ్ము రూ. 6 వేలను అతను నోట్ట వేసుకుని మింగడానికి ప్రయత్నించాడు. వెంటనే విజిలెన్స్ అతడి నోట్లో నుంచి ఆ కరెన్సీ నోట్లను బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక అధికారి అయితే ఏకంగా ఎస్‌ఐ నోట్లో చేతులు పెట్టి నోట్లను బయటకు తీయడానికి ప్రయత్నించాడు. మధ్యలో అడ్డుపడిన ఒక వ్యక్తిని విజిలెన్స్ అధికారి ఒకరు పక్కకు తోసేశాడు. మొత్తానికి ఎస్‌ఐ నోట్లో నుంచి కరెన్సీ నోట్లను కక్కించి మరీ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఎస్‌ఐపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News