Sunday, December 22, 2024

గ్యాంగ్‌స్టర్,పోలీస్ అధికారి మృతి

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లో కరడుగట్టిన నేరస్థుల ముఠాను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. జమ్ముకశ్మీర్ లోని కథువా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రాంగణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వాసుదేవ్ నాయకత్వం లోని షునూ గ్రూప్ ముఠాసభ్యులను పోలీస్‌లు వెంబడిస్తుండగా, గ్యాంగ్‌స్టర్లు తమ కారును మెడికల్ కాలేజీ క్యాంపస్ లోకి పోనిచ్చారు. అక్కడ పోలీస్‌లు అడ్డుకోవడంతో పోలీస్‌లకు, ముఠా సభ్యులకు మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయి.

కాల్పుల్లో ఎస్‌ఐ దీపక్‌శర్మ తలలోకి తూటా దూసుకుపోవడంతో తీవ్ర గాయమైంది.
కథువాలో ప్రాథమిక చికిత్స తరువాత పంజాబ్ లోని పఠాన్‌కోట్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శర్మ మృతి చెందారు. ఉధంపూర్‌కు చెందిన శర్మ సాంబా జిల్లా రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఈ సంఘటనలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News