ఫ్లోరిడా: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ట్రోఫీని సొంతం చేసుకుంది. సోమవారం ఉదయం కొలంబియాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో అర్జెంటీనా 10 గోల్ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోపా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో తుది పోరుకు అర్హత సాధించిన కొలంబియాకు నిరాశే మిగిలింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు అర్జెంటీనా అటు కొలంబియా ఆటగాళ్లు అసాధారణ ఆటతో అలరించారు. ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరూ వరుస దాడులు చేస్తూ ముందుకు సాగారు. అయితే ఇరు జట్ల పటిష్టమైన డిఫెన్స్ వల్ల గోల్స్ మాత్రం లభించలేదు. అర్జెంటీనా కాస్త దూకుడుగా ఆడినా ఫలితం లేకుండా పోయింది.
కొలంబియా ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమతో అర్జెంటీనా దాడులను సమర్థంగా తిప్పికొట్టారు. మరోవైపు అర్జెంటీనాకు పలు సార్లు గోల్స్ చేసే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక పోయింది. కొలంబియా గోల్ కీపర్ అద్భుత ఆటతో అర్జెంటీనా ఆటగాళ్ల దాడులను సమర్థంగా అడ్డుకున్నాడు. ప్రథమార్ధం ముగిసే సమయానికి ఇరు జట్లు గోల్స్ సా ధించడంలో విఫలమయ్యాయి. దీంతో తొలి అర్ధ భాగం గోల్ లేకుండానే ముగిసింది. సెకండ్ హాఫ్‌లో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. ఈ సారి రెండు జట్లు దూకుడును మరింత పెం చాయి. ఎటాకింగ్ గేమ్‌తో గోల్స్ కోసం సర్వం ఒడ్డాయి. ఇటు కొలంబియా ఆటగాళ్లు అటు అర్జెంటీనా ఆటగాళ్లు గోల్ సాధించేందుకు తీవ్రం గా శ్రమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. రెండో హాఫ్ ముగిసినా ఇరు జట్లకు ఒక్క గోల్ కూడా లభించలేదు.
ఇలాంటి స్థితిలో అదనపు సమయం కేటాయించక తప్పలేదు. ఇం దులో మాత్రం అర్జెంటీనా పైచేయి సాధించింది. 112వ నిమిషంలో మార్టినెజ్ అర్జెంటీనాకు అద్భు త గోల్‌ను సాధించి పెట్టాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకోవడంలో సఫలమైన అర్జెంటీనా కోపా అమెరికా ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా అవతరించింది. అర్జెంటీనాకు ఇది ఓవరాల్‌గా 16వ కో పా అమెరికా టైటిల్ కావడం గమనార్హం. ఈ టో ర్నీలో రికార్డు స్థాయిలో 30 సార్లు ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా 16 సార్లు ట్రోఫీని దక్కించుకుంది. కా గా, అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి కి ఇదే చివరి కోపా అమెరికా మ్యాచ్ కావడం విశేషం. ఫైనల్లో మెస్సి గాయపడ్డాడు. కులికాలి చీలలమండకు గాయం కావడంతో నొప్పితో విలవిల్లాడాడు. గాయం బాధిస్తున్నా మెస్సి మాత్రం ఆటను కొనసాగించాడు. కానీ 64వ నిమిషంలో నొప్పి తీవ్ర రూపం దాల్చడంతో మెస్సి మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అర్జెంటీనా విజయం సాధించిన తర్వాత మైదానంలోకి వచ్చిన మెస్సి సహచరులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.