Wednesday, January 1, 2025

ఇద్దరు నకిలీ విలేకరులు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మీడియా విలేకరులము అని చెప్పుకుంటున్న ఇద్దరు యూట్యూబర్లను సిటీ పోలీసులు పాతబస్తీలో అరెస్టు చేశారు. వారు గాంజా అమ్ముతున్నారని ఆరోపణ. వారిద్దరిని శుక్రవారం భవానీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాక వారి నుంచి 20 గ్రాముల గంజాయి, నకిలీ ప్రెస్ ఐడి కార్డులు, కత్తులు, మోటారుసైకిలు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అలందర్, మజ్‌హర్ గా గుర్తించారు.

భవానీనగర్ పోలీస్ స్టేషన్ కథనం ప్రకారం అలందర్, మజ్‌హర్ ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌లో తిరుగుతూ మత్తుకు అలవాటుపడిన వారికి గంజాయి పొట్లాలు అమ్ముతుంటారు. వారు గంజాయిని వేర్వేరు వర్గాల నుంచి సేకరిస్తుంటారు. భవానీనగర్ పోలీసులు వారిని ఆపినప్పుడు వారు తాము విలేకరులమని చెప్పి తనిఖీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిద్దరూ రాత్రి పూట దుకాణాలు తెరిచి ఉంటే దుకాణుదారులను కూడా బెదిరించి డబ్బు గుంజేవారని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా వారిని పోలీసులు అరెస్టు చేసి తర్వాత జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News