మన తెలంగాణ/హైదరాబాద్ / విద్యానగర్ : పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా బు ధవారం రాత్రి సంధ్య థియేటర్ తొక్కిసలా ట ఘటనపై సినీ హీరో అల్లు అర్జున్‌పై కే సు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డిసిపి ఆక్షాంశ్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అల్లు అ ర్జున్ థియేటర్‌కు వస్తోన్న నేపథ్యంలో భద్ర త విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రీమియర్ షోకు అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారని తెలిపారు. అభిమానులతో పాటు కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని, కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తొలుత సమాచారం ఇవ్వలేదని చెప్పారు.
దానికి తోడు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, క్రౌడ్ అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పా టు చేయలేదన్నారు. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడడంతో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. పోలీసులు అభిమానులను అదుపు చేసే క్రమంలో తోపులాట జరిగిందని, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుం బం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారని డిసిపి తెలిపారు. రేవతితో పాటు కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి, శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు వెల్లడించారు.