Monday, January 20, 2025

విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి ఆచూకీ చిక్కింది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడు ముంబైవాసి అని, అతడు ఇప్పుడు వేరే రాష్ట్రంలో తలదాచుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని ఒక పోలీసు అధికారి చెప్పారు. నిందితుడిపై లైంగిక దాడి, అమర్యాదకర ప్రవర్తన అభియోగాలపై కేసు నమోదు చేశారు.

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సభ్యంగా ప్రవర్తించిన ఆ ప్రయాణికుడిపై 30 రోజుల ప్రయాణ నిషేధాన్ని ఎయిర్ ఇండియా విధించింది. నవంబర్ 26న జరిగిన ఈ సంఘటనపై పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్(డిజిసిఎ) చర్యలకు ఆదేశించింది. మద్యం మత్తులో ఉన్న ఆప్రయాణికుడు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న 70వ పడిలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

రాత్రి భోజనం తర్వాత విమానంలోని లైట్లు డిమ్ చేసిన సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై ఆ మహిళా ప్రయాణికురాలు ఇమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. తన బట్టలు, షూస్, బ్యాగ్ మూత్రంతో తడిసిపోయాయని ఆమె ఫిర్యాదు చేశారు. కాగా..ఆమె ఫిర్యాదుపై విమాన సిబ్బంది స్పందిస్తూ ఆమెకు వేరే దుస్తులు, స్లిప్పర్లు అందచేసి తన సీటు వద్దకు వెళ్లాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News