Wednesday, January 22, 2025

జగద్గిరిగుట్టలో కార్డెన్ సెర్చ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఏసిపి హనుమంతరావు ఆధ్వర్యంలో 150 మంది పోలీసు సిబ్బంది బాల నగర్ లో  కార్డన్ సర్చ్ తనిఖీలు చేపట్టారు.
పిజెఆర్ నగర్, కెటిఆర్ నగర్, పలు కాలనీల్లో సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రౌడి షీటర్ల ఇళ్లను సైతం పోలీసులు తనిఖీలు చేశారు. కార్డెన్ సెర్చ్ లో భాగంగా ఆరు పోలీసు స్టేషన్ల సిబ్బంది, సైబరాబాద్ కమిషనరేట్ ఎఆర్ స్పెషల్  పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎసిపి హనుమంత్ రావు మాట్లాడుతూ గుర్తు తెలియని అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సరైన పత్రాలు లేకుండా వాహనాలు ఇంట్లో కలిగి ఉండరాదని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News