Friday, January 3, 2025

నీలగిరిలో కార్డన్ సెర్చ్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు డిఎస్పి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని సతీష్ నగర్లో పోలీస్ అధికారులు తమ సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గతంలో దొంగతనాలు చేసిన ఒక దొంగ, 32 మంది అనుమానితులను, అనుమతి పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు 20 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో టూ టౌన్, వన్ టౌన్, మహిళ పోలీస్ స్టేషన్ సీఐలు పీఎన్డీ ప్రసాద్, రౌతు గోపి , ఆదిరెడ్డి, ఎస్సైలు ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కంచర్ల భాస్కర్ రెడ్డి, సంపత్, సైదులు, సందీప్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News