Monday, December 23, 2024

నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : పట్టణ ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పి నాగభూషణం అన్నారు. సూర్యాపేట ఎస్పి రాజేంద్ర ప్రసాద్ మేరకు డిఎస్పి నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని 18వ వార్డు సుందరయ్య నగర్‌లో సూర్యాపేట పట్టణ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సరైన ధృవపత్రాలు లేని ముప్పై ఐదు ద్విచక్రవాహనాలు, మూడు ట్రాక్టర్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్‌లు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల పై, పాత నేరస్తుల కదలికల పై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. స్థానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని సూచించారు. నేరాల నివారణ చర్యలలో భాగంగా స్థానిక ప్రాంతాలో ప్రజలు స్వచ్ఛందంగా కూడాళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఆన్‌లైన్ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్‌కు స్పందించవద్దని, ఏ బ్యాంక్ సిబ్బంది అయిన కార్డ్ నంబర్, పిన్, ఓటిపి, సివివి వివరాలను ఎప్పుడూ వారి అడిగే అవకాశం లేదని వివరించారు. ఒకవేళ ఎవరైనా అడిగితే వారు సైబర్ నేరగాళ్లని గుర్తించాలని అన్నారు. బ్యాంక్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తామంటే అనుమా నించాలన్నారు. అనుమతి లేని ప్రైవేటు చిట్స్ ఫండ్స్‌లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయిన డయల్ వంద నంబర్‌కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సైలు యాట సైదులు, సతీష్ వర్మ, ట్రాఫిక్ ఎస్సై రవీందర్ నాయక్, ఏఎస్సై కువలవ్, శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News