Wednesday, January 22, 2025

రూ. 934 కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మెటీరియల్ సైన్స్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. న్యూయార్క్ కేం ద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్నిం గ్ సంస్థ మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచ ప్ర ఖ్యాతిగాంచిన సం స్థగా నిలిచింది. 172 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని త న తయారీ కేంద్రంగా ఎం చుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో రూ.934 కోట్ల రూపాయలతో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వా రా సంస్థ మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అవసరమైన గొరిల్లా గ్లాస్ను తయా రు చేయనున్నది.

భారతదేశంలో ఇలాంటి గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్కి తెలంగాణ తొలి కేంద్రం కానున్నది. ఈ భారీ పెట్టుబడి ద్వారా వారు ఎనిమిది వందల మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రా నున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ తో సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు జాన్ బెయిని ప్ర తినిధి బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప రిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మం త్రి కెటిఆర్ తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత రంగాలకు తెలంగాణ రాష్ట్రం త యారీ కేంద్రంగా మారుతున్న తీరును వివరిం చారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ ఇకో సిస్టం తెలంగాణలో బలోపేతమైన తీరును, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, మరికొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను విస్తృతపరుస్తున్న విషయాన్ని మంత్రి కెటిఆర్ తెలియజేశారు. దీంతోపాటు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్ కాన్ కూడా భారీ ఎత్తున తమ తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పాలసీల పట్ల ఇచ్చిన ప్రశంసలను ప్రత్యేకంగా ఈ సమావేశంలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో తయారీ రంగ పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవను, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తమకు తయారీ ప్లాంట్ కి కేంద్రంగా ఎంచుకున్నట్లు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌కి తెలిపారు. వివిధ అంతర్జాతీయ నగరాలను తమ పెట్టుబడి కోసం పరిశీలించి హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వారు మంత్రి కెటిఆర్‌కి తెలియజేశారు. తమ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చే విషయంలో మంత్రి కెటిఆర్ నాయకత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ నిరంతరం తమతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని, ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. తె

లంగాణ రాష్ట్రం ఐటి, ఐటి అనుబంధ రంగాల మాదిరిగానే ఎలక్ట్రానిక్స్ తయారీ విషయంలోనూ వేగంగా ముందుకుపోతున్న తీరు తమ దృష్టిలో ఉన్నదని, ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ పెట్టుబడి ద్వారా తమ తయారీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి గత తొమ్మిది సంవత్సరాలకు అనేక అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయని, అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్ వంటి దిగ్గజ సంస్థలతోపాటు అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడుల ద్వారా భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్ర యువతకు ఈ రంగంలో లభించే ఉద్యోగ అవకాశాల అంశం తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని మంత్రి కెటిఆర్ తెలియజేశారు. హైదరాబాద్ కేంద్రంగా తన తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న కార్నింగ్ సంస్థకు మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కెటిఆర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News