Wednesday, November 13, 2024

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం.. 179 మందికి గాయాలు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒడిషాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం పట్టాలు తప్పింది. రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో మధ్యాహ్నం తరువాత ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును ఢీకొన్న తరువాత ఈ రైలు పట్టాలు తప్పిందని వెల్లడైంది. ఏడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రయాణికులు చాలా మంది పక్కకు జరిగిన బోగీలలో కూరుకుపొయ్యారు. వీరిని సురక్షితంగా వెలికితీసేందుకు హుటాహుటిన రైల్వేసహాయక బృందాలు ఘటనా స్థలికి తరలివచ్చాయి.

132 మందికి పైగా గాయపడినట్లు ప్రాధమిక సమాచారం బట్టి తెలిసింది. ఈ ప్రాంతం అంతా ప్రయాణికుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించారు. ఈ ప్యాసింజర్ రైలు హౌరా నుంచి చెన్నైకు వెళ్లుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రైలు ఇంజిన్ గూడ్స్‌పైకి దూసుకుపోయినట్లు, బోగీలలోని పలువురు ప్రయాణికులు మృతి చెందినట్లు అనధికారిక వార్తలు వెలువడ్డాయి. గూడ్స్, రైలు ఎదురెదురుగా వచ్చినట్లు వెల్లడైంది. ఇది ఏ విధంగా జరిగిందనేది నిర్థారించుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News