Sunday, January 19, 2025

ఒడిషా దుర్ఘటనపై కేంద్రం పట్టాలు తప్పినరీతి ప్రకటనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శుక్రవారం రాత్రి ఒడిషాలో కోరమండల్, బెంగళూరు హౌరా యశ్వంతపూర్ , గూడ్స్‌రైళ్ల ఘోర ప్రమాదం తరువాతి దశలో కేంద్రం ఆధీనంలోని రైల్వే మంత్రిత్వశాఖ వివిధ దశలలో వెలువరించిన ప్రకటనలు గందరగోళానికి దారితీశాయి. ప్రమాదానికి మూలం ఏమిటనే విషయాన్ని దాదాపుగా మరుగనపడేసేలా చేశాయని రైల్వే భద్రతా విషయాల నిపుణులు పేర్కొంటున్నారు. సంబంధిత విషయాలను ప్రస్తావించారు. ప్రధాని మోడీ సంఘటనాస్థలిని సందర్శించిన తరువాత మాట్లాడుతూ ఈ ప్రమాదానికి బాధ్యులను వదిలేది లేదని హెచ్చరించారు. ఈ విధంగా ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందనే వాదనకు తెరతీశారు. గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మమత బెనర్జీ కూడా ప్రమాదం కాదు ఏదో జరిగిందనే విషయాన్ని ప్రస్తావించారు.

1. ఇక రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ప్రమాదానికి దారితీశాయని తెలిపారు.
2. ఇదే దశలో ముందు గ్రీన్ సిగ్నల్ పడిందని, తరువాత రెడ్‌సిగ్నల్ పడిందని, దీనితో డ్రైవర్ అయోమయంలో పడి రైలును వేరే రూట్లోకి మళ్లించారని మరో దశలో తెలిపారు.
3. అన్నింటికి మించి ఈ ఘటన జరిగిన చోట ఉండే సిగ్నల్ వ్యవస్థను ఎవరో కావాలనే తమ అధీనంలోకి తీసుకువచ్చి ప్రమాదం జరిగేలా రైలు పోనిచ్చేలా చేశారని, దీనితోనే ప్రమాదం జరిగిందని,ఈ అదృశ్య శక్తులు ఎవరనేది తేల్చుకోవల్సి ఉందని ఆదివారం మధ్యాహ్నం తెలిపారు. కానీ ఆదివారం సాయంత్రానికి మొత్తం ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. దీనితో ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది తేల్చడానికి, కారణాలు వెలికి రావడానికి ఎన్ని నెలలు పడుతుందనేది తెలియనిస్థితి ఏర్పడింది.
4. నిజానికి ఈ పలు అంశాలలో ముందుగా సిగ్నలింగ్ వ్యవస్థను ఎవరో దుర్వినియోగం చేసి, ప్రమాదానికి దారి కల్పించారనే విషయాన్ని అధికారులే తెలిపినప్పుడు దీనిపై ఎందుకు అత్యవసర ప్రాతిపదికన క్రిమినల్ దర్యాప్తు చేపట్టరాదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News