Sunday, December 22, 2024

మళ్లీ కరోనా అలజడి

- Advertisement -
- Advertisement -

ఒకేరోజు 166 కరోనా కేసులు

అన్నీ కేరళలోనే నమోదు

అలర్ట్‌గా ఉండాలని కేంద్రం సూచన

ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు..

న్యూఢిల్లీ : కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల పెరుగుదల హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి.24 గంటల వ్యవధిలో 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరిందని తెలిపింది కేంద్రఆరోగ్య శాఖ. మొన్నటి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100 గా ఉంది. చలికాలం కావడంతో ఇన్‌ప్లూయెంజా లాంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. ఇటీవల కరోనా పాజిటివ్‌తో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఓ మహిళ మృత్యువాత పడినట్లు వెల్లడించింది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కు వ కరోనా కేసులు జూలైలో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 2023 జూలై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే రికార్డయ్యాయని తెలిపారు. మొత్తానికి సడెన్ గా కరోనా కేసులు పెరగడంపై కేంద్రం అలర్టయ్యింది. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News