Friday, November 22, 2024

ప్రపంచవ్యాప్తంగా వారంలో కేసులు, మరణాలు 10 శాతం తగ్గాయి

- Advertisement -
- Advertisement -
Corona Cases and deaths decreased by 10 percent
ఆగ్నేయాసియాలో రెండు నెలలుగా తగ్గుముఖం : డబ్లూహెచ్‌ఒ నివేదిక

జెనీవా: గత వారం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19 కేసులు, మరణాలు 10 శాతంమేర తగ్గాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) తెలిపింది. కేసులు, మరణాలు రెండు నెలలుగా ఆగ్నేయాసియా ప్రాంతంలో తగ్గుముఖం పట్టాయని డబ్లూహెచ్‌ఒ తన నివేదికలో పేర్కొన్నది. వారంవారం ప్రపంచంలో కొవిడ్ పరిస్థితిపై నివేదికలిస్తున్న డబ్లూహెచ్‌ఒ తాజాగా సెప్టెంబర్ 2026 నివేదికను వెల్లడించింది. దీనికి ముందు వారంతో పోలిస్తే కేసులు, మరణాలు 10 శాతంమేర తగ్గాయని తెలిపింది. వారంలో ప్రాంతాలవారీగా కొత్త కేసుల సంఖ్య తూర్పుమధ్యధరాప్రాంతంలో 17 శాతం, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 15 శాతం, అమెరికా ప్రాంతంలో 14 శాతం, ఆఫ్రికన్ ప్రాంతంలో 12 శాతం, ఆగ్నేయాసియాలో 10 శాతంమేర తగ్గాయని తెలిపింది. అయితే, యూరోపియన్ ప్రాంతంలో మాత్రం గత వారంతో సమానంగానే కేసుల నమోదు కనిపించింది. యూరోపియన్, ఆఫ్రికన్ ప్రాంతాలను మినహాయిస్తే ప్రపంచంలో మరణాల సంఖ్య వారంలో 15 శాతంమేర తగ్గాయి.

మరణాల అత్యధిక తగ్గుదల 24 శాతంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో నమోదైంది. సెప్టెంబర్ 28వరకల్లా ప్రపంచంలో కొవిడ్ కేసుల సంఖ్య 23.10 కోట్లకు, మరణాల సంఖ్య 47 లక్షలకు చేరింది. కొవిడ్ వేరియంట్లలో ఆల్ఫా రకం 193 దేశాల్లో, బీటా రకం 142 దేశాల్లో, గామా 96 దేశాల్లో, డెల్టారకం 187 దేశాల్లో నమోదైంది. వారంలో కొత్త కేసులు అత్యధికంగా అమెరికాలో 7,65,827, బ్రెజిల్‌లో 2,47,397, యుకెలో 2,30,494, ఇండియాలో 2,04,582, టర్కీలో 1,92,778 నమోదయ్యాయని డబ్లూహెచ్‌ఒ తెలిపింది. మరణాలు అత్యధికంగా అమెరికాలో 14,842, రష్యాలో 5469, మెక్సికోలో 3689, బ్రెజిల్‌లో 3727, ఇరాన్‌లో 2967 నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News