Thursday, January 23, 2025

కొవిడ్ కేసుల తగ్గుముఖం

- Advertisement -
- Advertisement -

Corona cases are declining in Telugu states

తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుదల

తెలంగాణలో 2098కి తగ్గిన కొత్త కరోనా కేసుల నమోదు, ఎపిలో 10వేల నుంచి 4వేలకు దిగిన సంఖ్య

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 వేలకు పైగా నమోదైన కొవిడ్ కేసులు, తాజాగా 4 వేల దిగువకు వచ్చాయి. తెలంగాణలో కొత్తగా 2,098 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రోజువారీ కొవిడ్ కేసులు సుమారు 2 వేలు నమోదవుతుండగా, ప్రతిరోజూ 2 వేలకు పైగానే కొవిడ్ బాధితులు కోలుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలో వేలల్లో కొవిడ్ క్రియాశీల కేసులు ఉన్నప్పటికీ, రికవరీ రేటు మాత్రం 94 శాతానికి పైగానే ఉంటుంది. కొవిడ్ కేసుల నమోదు భారీగా తగ్గకపోయినప్పటికీ, పెరుగుతున్న రికవరీ రేటు ఊరట కలిగిస్తోంది. కొవిడ్ బాధితుల్లో హాస్పిటల్‌లో చేరే వారి సంఖ్య చాలా స్పల్పంగా ఉంటుంది.

ఏపీలో తాజాగా 13,005 మంది కొవిడ్ బాధితులు కోలుకోగా, తెలంగాణలో 2,098 మంది కోలుకున్నారు.అలాగే అంతకుముందు రోజు 4,559 మంది కోలుకున్నారు. అలాగే గత గురువారం 3,980 మంది, బుధవారం 3,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రోజుకు సుమారు 70 వేల నుంచి లక్షకుపైగానే టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుంటున్నారు. వీటితో పాటు లక్షణాలు ఉండి అనుమానం ఉన్న వారు ఇళ్ల వద్ద కూడా పరీక్షలు చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో 2,098 కొత్త కేసులు

రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,803 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,098 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,76,313కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,099కు చేరింది. తాజాగా కరోనా నుంచి 3,801 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,42,988 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.71 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 2,131 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

ఏపీలో 3,396 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3,396 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 29,838 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ నుంచి కొత్తగా 13,005 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78,746 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News