Wednesday, January 22, 2025

దడ పుట్టిస్తున్న మహామ్మారి….

- Advertisement -
- Advertisement -

Corona cases are increasing in Greater Hyderabad

గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 500లకుపైగా పాజిటివ్ కేసులు
మలేరియా, డెంగ్యూ, కరోనాతో ఆరోగ్య కేంద్రాలు రద్దీ
పరీక్షల కోసం బస్తీదవఖానలు, పీహెచ్‌ల వద్ద రోగులు క్యూ
భారీ వర్షాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారని వైద్యులు వెల్లడి

హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలకు కరోనా మహమ్మారి దడ పుట్టిస్తుంది. రోజు రోజుకు పాజటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటతో జనం బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మలేరియ, డెంగ్యూ వ్యాధులతో పాటు కరోనా విజృంభణ చేయడంతో బస్తీదవఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో రద్దీగా మారాయి. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 520కి పైగా పాజిటివ్ కేసులు నమోదైతుండటంతో రానున్న రోజుల్లో వైరస్ ప్రజల ప్రాణాలను హరిస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్న ఇష్టానుసారంగా తిరుగుతూ కరోనాకు రెక్కలు తొడుగుతున్నారని పేర్కొంటున్నారు. ఇదే విధంగా జనం నిర్లక్షంగా ఉంటే వైరస్‌ను అదుపు చేయడం కష్టమైతుందంటున్నారు. నెల రోజుల నుంచి ఆరోగ్య కేంద్రాల వైద్యులు, నర్సులు, ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు సెలవులు పెట్టకుండా విధులు నిర్వహిస్తున్నారు.

బస్తీలో తిరుగుతూ ప్రజలకు అవగాహన చేయడంతో పాటు టీకా ఇప్పించడం, వైరస్ లక్షణాలున్న వారిని సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించడం వంటి పనులు చేస్తూ కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. వాతావరణ ప్రభావంతో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలలో బాధపడుతూ పరీక్షలకు వెళ్లితే పాజిటివ్‌గా బయటపడుతుందన్నారు. వారం రోజుల పాజిటివ్ కేసులు చూస్తే హైదరాబాద్ జిల్లాలో గత నెల 29 వ తేదీన 366 మందికి, 30 న 327 కేసులు, గత నెల 3 వ తేదీన 355 మందికి సోకగా, ఈనెల 1 న 289 కేసులు, ఈనెల 2 వ తేదీన 396 మందికి, ఈనెల 3 న 376 కేసులు, ఈనెల 4 వ తేదీన 401 వైరస్ సోకినట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ పట్ల ప్రజలు వైద్యులు సూచించిన విధంగా బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల దాటిన వారు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొదని చెప్పారు. వాతావరణం చల్లిగా ఉండటంతో వైరస్ విజృంభణ చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు బయటకు వెళ్లేటప్పడు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కోవిడ్‌కు గురికాకుండా చూసుకోవాలని, వైద్యం కోసం తప్ప ఎలాంటి దూర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News