Wednesday, January 22, 2025

దేశంలో కరోనా కేసులు తగ్గు ముఖం

- Advertisement -
- Advertisement -

Corona cases are on the decline in india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 6396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556కు చేరింది. ఇందులో 4,23,67,070 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 69,897 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,14,589 మంది మృతిచెందారు. గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు 13,450 మంది కరోనా నుంచి బయటపడగా, 201 మంది మరణించారు. కాగా, కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News