Wednesday, January 22, 2025

కరోనా హైరానా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/బెంగళూరు/పాట్నా: దేశంలో విదేశీ కరోనా భయాలు ఎక్కువ అయ్యాయి. విదేశాలకు వెళ్లి తిరిగి దేశానికి వస్తున్న వారిలో ఎక్కువ మందికి కరోనా ఉన్నట్లు నిర్థారణ కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారి కలవరం చెలరేగింది. విదేశాల నుంచి విమానాలలో వచ్చిన వారిలో సోమవారం ఒక్కరోజే మొత్తం మీద 16 మందికి కోవిడ్ 19 వైరస్ ఉన్నట్లు వివిధ స్థాయిల్లో నిర్థారణ కావడం. వీరిని ఐసోలేషన్‌లకు, తగు పరీక్షలకు పంపించడం, రక్తనమూనాలను ల్యాబ్‌లకు పంపించ డం జరుగుతోంది. సోమవారం బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులలో 12 మందికి కోవిడ్ ఉన్నట్లు నిర్థారణ అయింది. వీరిలో ఒ క్కరు చైనా నుంచి వచ్చిన వ్యక్తి కావడం, అక్కడి వైరస్ వేగంగా వ్యాప్తి లక్షణాలు ఉండేదిగా తేలడంతో బెంగళూరు, కర్నాటకలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యపరంగా ఆందోళనతలెత్తింది.

నిర్ణీత ప్రదేశాలలో అంటే సినిమా థియేటర్లు, విద్యాసంస్థ ల్లో మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ సో మవారం కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి కూడా నియమావళిని వెలువరించింది. వేడుకలు రాత్రి 1 వరకు అనుమతిస్తారు. ఇక రెండు డోస్‌ల కోవిడ్ టీకా లు పొందిన వారికే పబ్‌లు రెస్టారెంట్లలోకి అనుమతిస్తారు. సీటింగ్ కెపాసిటికే వీలు క ల్పిస్తారు. ఇక బీహార్‌లోని గయ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి న వారిలో నలుగురు విదేశీ జాతీయులకు కొవిడ్ ఉన్న ట్లు పరీక్షల దశలో నిర్ధారణ అ యింది. గయ ఎయిర్‌పోర్టులో వీ రికి ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు జరిపి వెంటనే స్థా నిక హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన 12 మంది ప్రయాణికులకు కోవిడ్ 19 వైరస్ ఉన్నట్లు పరీక్షల క్రమంలో నిర్థారణ అయింది.

బెంగళూరు విమానాశ్రయానికి పలు విమానాలలో వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా ఓకేసారి డజన్ మందికి కరోనా ఉన్నట్లు తేలడంతో బెంగళూరులో అంతా అప్రమత్తం అయ్యారు. చైనా నుంచి వచ్చిన ఓ 37 ఏండ్ల వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్లు తేలింది. మిగిలిన 11 మంది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలలలో పర్యటించి వచ్చిన వారే. కరోనా సోకినట్లు నిర్థారణ అయిన వారిని చికిత్సకు పంపించగా మిగిలిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. కరోనా నిర్థారణ అయిన వారి రక్తనమూనా పరీక్షల శాంపుల్స్‌ను వెంటనే వైరాలజీ ఇనిస్టూట్‌కు పరీక్షలకు పంపించారు. వీటి ఫలితాలు వస్తే వైరస్ తీవ్రత ఏమిటనేది తేలుతుంది. శనివారం చైనా నుంచి యుపిలోని ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ ఉన్నట్లు తేలడంతో వెంటనే ఆయనను క్వారంటైన్‌కు పంపించారు.
నలుగురు విదేశీయులకు కరోనా
బీహార్‌లోని గయ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు విమానాలలో వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా వీరిలో నలుగురు విదేశీయులకు కరోనా ఉన్నట్లు స్పష్టం అయింది. వీరిలో ఒకరు మయన్మార్ నుంచి , ఒకరు థాయ్‌లాండ్ నుంచి ఇద్దరు ఇంగ్లాండ్ నుంచి బుద్ధ గయకు వచ్చారు. బౌద్ధుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన ఈ స్థలంలో బోధ్ మహోత్సవ్ వచ్చే నెలలో జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు పలు దేశాల నుంచి ఇక్కడికి తరలివస్తారు. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చిన వారిలో నలుగురికి కరోనా నిర్థారణ కావడం ఈ క్షేత్రంలో గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు గయకు వచ్చిన వారిలో కరోనా నిర్థారణ అయిన విషయాన్ని స్థానిక వైద్యాధికారి డాక్టర్ రంజన్ సింగ్ నిర్థారించారు. అయితే ఇది తీవ్రస్థాయి వైరస్ కాదని తెలిపారు. అయితే వీరి వల్ల ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News