Sunday, December 22, 2024

ముంబైలో 130 శాతం పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona cases increased by 130 per cent in Mumbai

న్యూఢిల్లీ : దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 800 తగ్గుదల కనిపించడం కాస్త ఊరట కలిగించే విషయం. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం సోమవారం 3,07,716 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 3714 కేసులు వెలుగు లోకి వచ్చాయి. వీటిలో మహారాష్ట్ర నుంచే వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. ఇక ముంబైలో వారం రోజుల్లో కొత్త కేసుల సంఖ్య 136 శాతం పెరగడం గమనార్హం. గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందగా, ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,24,708 కి చేరింది. సోమవారం 2513 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4.26 కోట్లకు చేరింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉంటుండటం, క్రియాశీల కేసులపై ప్రభావం చూపిస్తోంది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,976 (0. 06 శాతం) కు పెరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సోమవారం 13,96,169 మంది టీకాలు తీసుకోగా, ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 194.27 కోట్లు దాటింది. ఇక కేరళలో కొత్తగా నోరో వైరస్ కలకలం రేపుతోంది. తిరువనంతపురంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో కేంద్రం ఈ వైరస్ కేసుకు సంబంధించిన నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News