Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 27,553 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona Cases increased in India

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 284 మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.48కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,81,870 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 9249మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22, 801 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 145 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News