- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ జైళ్లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తిహార్ జైలులో 21 మంది సిబ్బందికి, 16 మంది ఖైదీలకు కోవిడ్ మహమ్మారి సోకింది. మండోలి జైలులో ఇద్దరు సిబ్బంది, ఐదుగురు ఖైదీలకు కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. అటు రోహిణి జైలులో ఐదుగురు సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. ప్రపంచంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయందోళనకు గురిచేస్తున్న వేళ భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు కావడం ప్రజలను భయపెడుతోంది.
- Advertisement -