* మహారాష్ట్రలో పెరుగుతుండంతో భయాందోళనలో ప్రజలు
* రోజుకు 30కిపైగా నమోదైతున్న పాజిటివ్ కేసులు
* గౌలిదొడ్డి స్కూల్‌లో విద్యార్దులకు టెస్టులు,ఒకరికి పాజిటివ్
* పండగలు, వేడుకలు పరిమిత సంఖ్యలో చేసుకోవాలంటున్న వైద్యులు
హైదరాబాద్: మహానగర ప్రజలకు కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. ఏటువైపు నుంచి వచ్చి కబలిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల నుంచి వాతావరణం మార్పుతో చలి పెరగడంతో వైరస్ విజృంభించే అవకాశం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు. గత ఆరునెల నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు గత ఐదారు రోజుల నుంచి రోజుకు 30 కిపైగా కేసులు నమోదైతున్నాయి. తాజాగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర, కర్నాటక వైరస్ పుంజుకోవడంతో యావత్మాల్ జిల్లాలో లాక్‌డౌన్ విధించారు. అక్కడి నుంచి మన రాష్ట్రానికి ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో కరోనా రెక్కలు కట్టుకుందని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గొలిదొడ్డి గురుకుల పాఠశాల్లో విద్యార్దులకు టెస్టులు చేయగా ఒకరికి పాజిటివ్ బయటపడింది.
స్కూల్‌కు వెళ్లాలంటే విద్యార్దులు భయపడుతూ తరగతిలో గదిలో 30మంది విద్యార్దులను చేర్చి పాఠాలు బోధిస్తున్నారని, వారిలో ఒకరికి లక్షణాలు కనిపించిన వైరస్ అందరికి సోకుతుందని హడలిపోతున్నారు. కోవిడ్ నిబంధనలు నామమాత్రంగా పాటిస్తూ ఫీజుల వేటలో పడ్డారు. ప్రైవేటు పాఠశాలపై వైద్యశాఖ నిఘా పెట్టాలని విద్యార్దుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పాటు బస్తీదవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు పెంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారంతా ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. ఎట్టి పరిస్దితుల్లో నిర్లక్షం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మరణాలు తగ్గిన ఊపిరితిత్తుల సమస్యతో చాలామంది ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. గ్రేటర్‌లోని 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీ దవాఖానలో సిబ్బంది అందుబాటులో ఉండి , లక్షణాలున్న ప్రతిఒకరికి టెస్టులు చేస్తామని ఆరోగ్య కేంద్రాలు అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా హోంఐసోలేషన్ ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామంటున్నారు.
గత వారం రోజుల నుంచి కేసులు వివరాలు పరిశీలిస్తే ఫిబ్రవరి 12వ తేదీన 31, 13న 29కేసులు, 14వ తేదీన 24, 15 న 23కేసులు, 16వ తేదీన 26, 17న 31కేసులు, ఈనెల 18 వ తేదీన 35 కేసులు,ఈనెల 19వ తేదీన 27 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇకా నుంచి కేసులు పెరిగే చాన్స్ ఉందని వైద్యులు భావిస్తున్నారు. మెడిసిన్‌తో వైరస్ తగ్గుతుందని ప్రజలు భావించవద్దని, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయవచ్చని, గత ఏడాది నుంచి ప్రజలు ఏవిధంగా బయటకు వెళ్లితే ముఖానికి మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించడం, చేతులను శానిటైజర్‌తో కడగడం వంటివి పాటించాలని, వీటిని నిర్లక్షం చేస్తే వైరస్ కాటు వేస్తుందని జిల్లా వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా పండగలతో పాటు వేడుకలు పరిమిత సంఖ్యలో కార్యాలు చేసుకోవాలని, పెద్ద ఎత్తున చేసుకోవాలనుకుంటే మళ్లీ కరోనాకు రెక్కలు తొడిగినట్లేనని, వైద్యులు సూచించిన సలహాలు పాటించి కరోనా కాటుకు బలికాకుండా కాపాడుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.