Sunday, November 3, 2024

శవాలను పూడ్చడానికి అక్కడ స్థలం లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొవిడ్‌కు గురైన రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. మృతదేహాలను ఖననం చేయడానికి స్మశాన వాటికలలో స్థలం లేకపోవడంతో టెంట్లలో మృతదేహాలను ఉంచవలసి పరిస్థితి ఏర్పడిందని మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్ ఒక వీడియోలో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చైనాలోని ప్రతి నగరంలో సగం జనాభా కరోనా వైరస్ బారినపడిందని చైనాకు చెందిన శాస్త్రవేత్త జెంగ్ గ్వాంగ్ తెలిపారు.

డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 20 మధ్య 25 కోట్ల మంది చైనాలో కరోనా వైరస్ బారినపడినట్లు చైనా ఆరోగ్య సంస్థకు చెందిన ఒక రహస్య నివేదిక పేర్కొంది. చైనాపై 17 దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించాయి. ఇండియాతోపాటు స్వీడన్, జర్మనీ, మలేషియా, ఖతర్, బల్జియం, ఆస్ట్రేలియా, కెనడా, మొరాకో, ఫ్రాన్స్, బ్రటిన్, స్పెయిన్, అమెరికా, జపాన్, ఇజ్రాయిల్, దక్షిణ కొరియా దేశాలు చైనాపై ప్రయాణ ఆంక్షలను విధించాయి. జపాన్‌లో కూడా కొవిడ్ అల్లకల్లోలం చేస్తోంది. ఒక్క శుక్రవారం నాడే 456 మంది కరోనా రోగులు మరణించినట్లు జపాన్ టైమ్స్ వెల్లడించింది. జపాన్ రాజధాని టోక్యోలో 20, 720 మంది కొత్తగా కరోనా బారినపడినట్లు, వీరిలో 650 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పత్రిక తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News