Tuesday, September 17, 2024

క్రీడలపై కరోనా పిడుగు

- Advertisement -
- Advertisement -

sports

 

ఎక్కడికక్కడే
ఆగిన ఆటలు

మన తెలంగాణ/క్రీడా విభాగం: కరోనా మహమ్మరి ప్రభావం ప్రపంచ క్రీడారంగాన్ని కూడా కుదిపేస్తోంది. రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న కరోనాతో ఎక్కడికక్కడ క్రీడలు ఆగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు ఒలింపిక్స్, వింబుల్డన్ వంటి మెగా క్రీడలు రద్దు కాక తప్పలేదు. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన పలు ప్రముఖ క్రీడలు కూడా అర్ధాంతరంగా రద్దవ్వడమో లేకుండా వాయిదా పడడమో జరుగుతోంది. దీంతోపాటు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ టోర్నీగా పేరున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. ఇక, ఫార్మూలావన్, బ్యాడ్మింటన్, టిటి, బాక్సింగ్, షూటింగ్, క్రికెట్ టోర్నీలపై కూడా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పలు సిరీస్‌లను వాయిదా వేసింది. అంతేగాక ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లను కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, కరోనా దెబ్బకు యూరోపియన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ కూడా వాయిదా పడింది. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు సాకర్ టోర్నీలను అర్ధాంతరంగా రద్దు చేశారు. ఇటలీ, ఇంగ్లండ్, అమెరికా, స్పెయిన్, బ్రెజిల్ తదితర దేశాలకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన సాకర్ లీగ్‌లను రద్దు చేయక తప్పలేదు. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఎన్‌బిఎ బాస్కెట్‌బాల్ లీగ్‌లు కూడా ఆగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్‌లు కూడా కరోనా దెబ్బకు రద్దయ్యాయి.

ఒలింపిక్స్ కూడా..
ఇక, కరోనా దెబ్బకు విశ్వ క్రీడలు ఒలింపిక్స్ కూడా ఏడాది పాటు వాయిదా పడక తప్పలేదు. ఈ ఏడాది జులైఆగస్టు నెలల్లో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం నెలకొనడంతో జపాన్ ప్రభుత్వం ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేసేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికా వంటి పెద్ద దేశాలు ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని జపాన్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఆరంభంలో నిర్ణీత సమయంలోనే క్రీడలను నిర్వహించాలని జపాన్ భావించింది. అయితే కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చడంతో క్రీడలను వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో ఈ క్రీడలు 2021 జులైలో ఆరంభమవుతాయి. ఇక, ఒలింపిక్స్ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడంతో దీనికి అర్హత సాధించిన క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారింది. మరో ఏడాది పాటు తమ ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను కాపాడు కోవాల్సిన పరిస్థితి ఆటగాళ్లకు నెలకొంది. ఇక, క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జపాన్‌కు కూడా ఇది సమస్యగా మారింది.

 

Corona effect on global sports
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News