Monday, December 23, 2024

సీజనల్ ప్లూ గా కరోనా మహమ్మారి….

- Advertisement -
- Advertisement -

వైరస్ తగ్గుముఖంతో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేత
నేటి నుంచి వర్క్‌ఫ్రం హోమ్ రద్దు, కార్యాలయాలకు సిబ్బంది
నిబంధనలు ఎత్తివేతతో పూర్వవైభవం వస్తుందని భావిస్తున్న మెట్రోరైల్
విద్యార్థులతో సందడిగా మారునున్న పలు పాఠశాలలు
ప్రజలు జాగ్రత్తలు పాటించడంతోనే మహమ్మారి తగ్గిందంటున్న వైద్యాధికారులు

India Reports over 1.27 lakh fresh corona cases 

మన తెలంగాణ, సిటీబ్యూరో:  గ్రేటర్‌లో గత వారం రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడటంతో వైద్యశాఖ అధికారులు థర్డ్‌వేవ్ ముగిసినట్లేనని పేర్కొన్నారు. దీంతో కోవిడ్ అంక్షలు ఎత్తివేసినట్లు, ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించాల్సిన అవసరంలేదని, అందరు తమ కార్యాలయాలకు వచ్చి గతంలో పనిచేసినట్లు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎన్ని వేరియంట్లు పుట్టుకొచ్చిన ప్రస్తుతం ఉన్న వైద్య పరికరాలు, సిబ్బంది సులువుగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. ఇప్పట్లో వేరియంట్లు వచ్చే అవకాశం లేదని, పస్ట్, సెకండ్ టీకాలతో పాటు బూస్టర్ వ్యాక్సిన్లలతో కరోనా వేగానికి కళ్లెం వేసినట్లు వెల్లడిస్తున్నారు. పాజిటివ్ కేసులు తగ్గుతున్న ఫీవర్ సర్వే సాగుతుందని, కరోనాను సీజనల్ ప్లూగా పరిగణలోకి తీసుకునే అవకాశ ఉందన్నారు.

మహమ్మారి మొదటి వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ ఆరు నెలలు, థర్డ్‌వేవ్ మూడు నెలలు మాత్రమే నగరంపై ఉనికి చాటిందన్నారు. రేపటి నుంచి సాప్ట్‌వేర్ సంస్దలు సిబ్బందితో సందడిగా మారనున్నాయి. కరోనా ప్రభావం ఆర్దిక కష్టాలు ఎదుర్కొన్న మెట్రో రైల్ కూడా ఆంక్షలు ఎత్తివేతతో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు కార్యాలయాలకు వెళ్లుతుండటంతో మళ్లీ ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తాయని మెట్రో సిబ్బంది భావిస్తున్నారు. విద్యాసంస్దల్లో కోవిడ్ నిబంధనలతో తరగతి గది 20మంది విద్యార్ధులే ఉండాలన్న ఆదేశాలతో అదనపు గదులు ఏర్పాటు చేసి ఆర్దికపరమైన ఇబ్బందులు పడ్డారు. నేటి నుంచి గతంలో నిర్వహించిన తరగతిలో 40మంది చిన్నారులు కూర్చోబెట్టేలా బెంచీలు సిద్దం చేస్తున్నట్లు పాఠశాలల నిర్వహకులు తెలిపారు. మాల్స్, వస్త్ర, బంగారు దుకాణాలకు వెళ్లితే భౌతికదూరంతో రెండు గంటల సమయం పట్టేందని, థర్డ్‌వేవ్ ముగింపుతో ఏవస్తువునైనా ఆరగంటలో తీసుకుని ఇంటికే వెళ్లుతామని నగరవాసులు అంటున్నారు.

పెళ్లిళ్లు, విందులు, వినోదాలు పరిమిత సంఖ్యలో కాకుండా బంధుమిత్రులతో అంగరంగ వైభవం తీసుకునే వాతావరణం రావడం హర్షనీయమైన వెల్లడిస్తున్నారు. గ్రేటర్ వారం రోజుల నుంచి పాజిటివ్ కేసుల గణంకాలు పరిశీలిస్తే ఈనెల 1వ తేదీన 859 మందికి సోకగా, ఈనెల 2న 747 కేసులు, ఈనెల 3వ తేదీన 649 పాజిటివ్ కేసులు, ఈనెల 4న 688మందికి సోకింది. ఈనెల 5వతేదీన 629 మందికి పాజిటివ్ రాగా, ఈనెల 6న భారీ తగ్గి 383 కేసులు వచ్చినట్లు, ఈనెల 7వ తేదీన 350మందికి వైరస్ సోకినట్లు వెల్లడిస్తున్నాయి. ఈనెలాఖరు వరకు పూర్తి వైరస్ ప్రభావం తగ్గుతుందని, నగర ప్రజలు వైద్యాధికారుల సూచనలు పాటించి భౌతికదూరం ఉంటూ, దగ్గు, జలుబు, లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు వెళ్లి టెస్టులు చేసుకుని, హోంఐసోలేషన్ ఉండి మహమ్మారి విస్తరించకుండా చేశారని వైద్యాధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News