- Advertisement -
కడిపికొండ: వరంగల్ పట్టణ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కాజీపేట మండలం కడిపికొండలో 20 మందికి కరోనా వైరస్ సోకింది. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు,సిబ్బంది హూటాహుటిన కడిపికొండ చేరుకుని ఇంటింటికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు చాలా మంది హాజరయ్యారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందిందని అధికారులు గుర్తించారు. కాగా, ఒకే కుటుంబలో 13 మంది వ్యాది బారినపడినట్టు అధికారులు తెలిపారు. అందిరికీ పరీక్షలు నిర్వహిస్తుండడంతో కేసులు పెరిగే అవకాశాలున్నాయి. అటు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
Corona for 20 people in Kadipikonda
- Advertisement -