Friday, November 22, 2024

రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉంది

- Advertisement -
- Advertisement -

వాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది
అయితే నిర్లక్ష్యం మాత్రం వద్దు
మహమ్మారి పూర్తిగా పోయేంత వరకు జాగ్రత్తలు తప్పని సరి
సెయింట్ థెరిసా ఆసుపత్రిలో టెక్ మహీంద్రా సంస్థ అందించిన ఏడు అంబులెన్స్‌లు, ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

Corona is completely under control

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతం కరోనా పూర్తిగా నియంత్రణలో ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ వైరస్‌ను కట్టడికి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ముందస్తూ చర్యలు తీసుకుందన్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య సైతం రోజురోజుకు గణనీయంగా తగ్గుతోందన్నారు. అలాగే మరణాల సంఖ్య కూడా చాలా స్వల్పంగా నమోదు అవుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా శరవేగంగా సాగుతోందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజల్లో కూడా కరోనా పట్ల బాగా అవగాహన పెరిగిందన్నారు. అయితే నిర్లక్షం మాత్రం మంచిది కాదని ఆయన సూచించారు. కరోనా మహమ్మారి పూర్తిగా పోయేంత వరకు తగు జాగ్రత్తులు ప్రజలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

సోమవారం హైదరాబాద్ సనత్‌నగర్‌లోని సెయింట్ థెరిసా ఆసుపత్రికి టెక్ మహీంద్రా సంస్థ అధించిన ఏడు అంబులెన్స్‌లు, కోటి రూపాయల విలువ గల ఆక్సిజన్ ప్లాంటును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రజలను ఇబ్బంది తీవ్ర స్థాయిలో పెడుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్లాంటు, అంబులెన్స్‌లు అందిచండంపై హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామలు కావాలని ఈ సందర్భంగా టెక్ మహీంద్రా ఫౌండేషన్ ప్రతినిధులకు కెటిఆర్ సూచించారు. సిఎస్‌ఆర్ కింద మహీంద్రా గ్రూప్ అందించిన ఏడు అంబులెన్స్‌లను గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన చోట ప్రారంభిస్తామన్నారు.

మహీంద్రా గ్రూప్ ఒక్క రంగానికే పరిమితం కాలేదన్నారు. అనేక రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. టెక్ మహీంద్రా యూనివర్సిటీని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇందులో 24వేల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. మహీంద్రా గ్రూప్ పెద్దఎత్తున సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. భవిష్యత్‌లోనూ ఈ సంస్థ మరిన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అకాంక్షించారు. జహీరాబాద్‌లో మహీంద్రా సంస్థ లక్ష పైచీలుకు ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తోందని వెల్లడించారు. వరంగల్‌లో కూడా వారి కార్యకలాపాలు విస్తరించారన్నారు. అలాగే మరిన్ని జిల్లాలోనూ సంస్థ కార్యకలాపాలు విస్తరించాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో భాగంగా రాష్ట్రంలో మహీంద్రా యూనివర్సిటిని నెలకొల్పండం జరిగిందన్నారు. ఇలా ఎన్నో రంగాల్లో ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వానికి, నిరుద్యోగులకు అండగా ఉంటోందన్నారు. టెక్ మహీంద్రా తరహాలోనే ఇతర సంస్థలు కూడా సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News