Sunday, December 22, 2024

కోరలు చాస్తున్న కరోనా

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు

తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు… అన్నీ హైదరాబాద్‌లోనే

మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొవి డ్ మరణం నమోదు కావడం పట్ల తెలుగు ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో దాదాపు ఏడాదిన్నర తర్వాత రెండు కరోనా మ రణాలు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కరోనా మరణం నమోదైంది. ఉస్మానియా ఆస్పత్రిలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో చనిపోయి న ఇద్దరిలో కొవిడ్ గుర్తించినట్టు ఆస్పత్రి వర్గా లు సైతం ధ్రువీకరించాయి. ఉస్మానియా ఆస్పత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చేరిన ఓ రోగి మృ తి చెందగా, మరొకరు గుండె సంబంధిత వ్యాధి తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు ఆ ఇద్దరికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.అలాగే ఎపిలోని విశాఖపట్నంలో కెజిహెచ్ ఆసుపత్రిలో కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఒక మహిళ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
వేగంగా వ్యాప్తిస్తున్న కొవిడ్ వైరస్
రాష్ట్రంలో కొవిడ్ వైరస్ మరోమారు వేగంగా వ్యాపిస్తోంది. గడచిన వారం రోజుల్లోనే ఏకం గా 59 మందికి వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. అందులోనూ హైదరాబాద్‌లోనే దాదాపు 90 శాతానికి పైగా కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రా ష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,333 కరోనా పరీక్షలు చేయగా  8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 8 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి నలుగురు కోలుకోగా.. మరో 59 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొవిడ్ నమోదవుతున్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ పరీక్షలు పెంచి పాజిటివ్ వచ్చిన వారికి చికిత్సలు అందించేందుకు ఆసుపత్రులను సిద్ధం చేసింది. పిల్లలు, వృద్ధులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు సమూహంగా ఉన్న జనంలోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం మంచిదని తెలిపారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలనన్నారు. ప్రభుత్వం తెలిపిన కొవిడ్ నియమాలను తప్పక పాటించాలని సూచించారు.
అవి కొవిడ్ మరణాలు కావు :
మన తెలంగాణ/గోషామహల్: అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్సల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ ఇద్దరు రోగులు మృతి చెందారు. ఇన్ పేషంట్లుగా చికిత్సలు పొందుతున్న నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాగా చికిత్సల నేపథ్యంతో వారికి నిర్వహించిన కొవిడ్ పరీక్షల నివేదిక మరుసటి రోజు రావడంతో వారికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థ్దారణ అయ్యింది. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో కరోనాతో చికిత్సలు పొందుతూ ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ వివరణ ఇచ్చారు. కొవిడ్ లక్షణాలతో వారు చికిత్సలకు రాలేదని, వారు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందిన తర్వాత వారికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థ్దారణ అయినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే…. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న బండ్లగూడ దూద్‌బౌలీ ప్రాంతానికి చెందిన మహ్మద్ సుభాన్ (62) చికిత్సల నిమిత్తం ఈ నెల 14వ తేదీన ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. ఎడమ జఠరిక (గుండె సంబంధిత వ్యాధి) శ్వాసకోస వంటి అనారోగ్య ఇబ్బందులతో చికిత్సలు పొం దుతున్నారు. కాగా అతనికి కొవిడ్ లక్షణాలున్న ట్లు అనుమానించిన వైద్యులు ఈనెల 22న కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. గుండె, ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో సుభాన్ ఆరోగ్య పరిస్థితి విషమించి, ఈ నెల 24వ తేదీన మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అతను మృతి చెందిన మరుసటి రోజున కొవిడ్ పరీక్ష నివేదికలో మహ్మద్ సుభాన్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్లు పేర్కొన్నారు. కాగా అదే విధంగా కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యూసుఫ్ (42) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్సల నిమిత్తం ఈ నెల 19వ తేదీన ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. యూసుఫ్‌ను ఇన్ పేషంట్‌గా చేర్చుకుని మె డిసిన్ విభాగం వైద్యులు చికిత్సలు నిర్వహిస్తున్నారు. చికిత్సల్లో భాగంగా ఈ నెల 20న యూసుఫ్‌కు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న మహ్మద్ యూసుఫ్ ఆరోగ్య పరిస్థితి వికటించడంతో 22న మృతి చెందాడు. మృతి చెందిన అనంతరం కొవిడ్ పరీక్ష నివేదికలో మహ్మద్ యూసుఫ్‌కు కొవిడ్ సోకినట్లు తేలిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వీరిద్దరిలో ఎవ్వరూ కూడా కొవిడ్ లక్షణాలతో చికిత్సల నిమిత్తం రాలేదని, ఇతరత్రా అనారోగ్య కారణాలతో వచ్చినప్పటికీ చికిత్సల్లో భాగంగా కోవిడ్ పరీక్షలు చేసినట్లు డ్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు.
మరో ముగ్గురికి కొవిడ్ చికిత్సలు…
ఉస్మానియా ఆసుపత్రిలో కొవిడ్ పాజిటివ్ రావడంతో మరో ముగ్గురికి ఐసోలేషన్ వార్డులో ఉస్మానియా వైద్యులు చికిత్సలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 12 ఏళ్ల బాలికతో పాటు రాజేంద్రనగర్‌కు చెందిన పల్లె లక్ష్మణ్ (36), వికారాబాద్ జిల్లా ధారూర్ ప్రాంతానికి చెందిన పార్వతమ్మ (62)లు ఈ నెల 20న చికిత్సల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో చేరగా, వారికి కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వారికి చికిత్సలు అందిస్తున్నారు.
నెల రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్నాం : ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన ఇన్ పేషంట్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉస్మాని యా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు. ఇతర రోగులకు ఇబ్బందుతు తలెత్తవద్దన్న ఉద్దేశంతో గల నవంబర్ నెల నుండి ఇన్ పేషంట్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో చికిత్సలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల వాతావరణ మార్పులతో చలి తీవ్రత పెరగడంతో ఉస్మానియాలో చికిత్స లు పొందుతున్న ప్రతి రోగికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. మరో ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ రావడంతో వారికి ఐసోలేషన్ వా ర్డులో చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా రోగులకు చికిత్సలు ని ర్వహిస్తున్న క్రమంలో ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులకు కొవిడ్ సోకడంతో వారు ఐసోలేషన్లో ఉండి, చికిత్సలు పొందుతున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News