- Advertisement -
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతూ ఊరట కలిగిస్తున్నాయి. మరణాలు కూడా వంద లోపే ఉంటున్నాయి. మంగళవారం 6.77 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 1778 కొత్త కేసులు బయటపడ్డాయి. ముందు రోజుకంటే కాస్త పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 2542 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య 23,087 కు తగ్గి పోవడంతో మొత్తం కేసుల్లో క్రియాశీల రేటు 0.05 శాతానికి క్షీణించింది. ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా, 4.24 కోట్ల మంది (98.75 శాతం) మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 62 మంది మృతి చెందగా, మొత్తం మరణాలు 5.16 లక్షలు దాటాయి. ఇక మంగళవారం 30.5 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 181 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్టు కేంద్రం వెల్లడించింది.
- Advertisement -