జెనీవా : గత వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు అంతగా లేకపోయినప్పటికీ, కొత్త కేసులు 55 శాతం అంటే దాదాపు 15 మిలియన్ వరకు పెరిగాయని, మరణాలు 43,000 వరకు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో కొత్త కేసులు 400 శాతం వరకు అమాంతంగా పెరిగిపోవడం విశేషం. భారత్, తిమోర్ లెస్టే, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లో కేసులు భారీ సంఖ్యంలో పెరిగాయి. ఆగ్నేయాసియాలో 6 శాతం వరకు మరణాలు తగ్గాయి. ఆఫ్రికాలో 11 శాతం వరకు కేసులు తగ్గుముఖం పట్టగా మిగతా రీజియన్లలో కొత్త కేసులు పెరిగాయని పేర్కొంది. బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని తరువాతి దశ ఏ విధంగా ఉంటుందో చెప్పలేమన్నారు. ఈ వారం అమెరికాలో 78 శాతం , ఐరో పా దేశాల్లో 31 శాతం వరకు కరోనా కొత్త కేసులు పెరిగాయని, మరణాలు 10 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.