Saturday, April 5, 2025

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్ లో కరోనా కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌, కేరళలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, కేరళలో కరోనాతో ఐదుగురు చనిపోయారు. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశించింది. కాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన హైలెవెల్‌ మీటింగ్ నిర్వహించి మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News