- Advertisement -
తాజాగా 21 మరణాలు
సియోల్ : ఉత్తర కొరియాలో వ్యాక్సినేషన్ లేని ప్రజలను కరోనా వెంటాడుతోంది. శనివారం 21 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,74,440 మంది జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. శుక్రవారం నుంచి కరోనా ప్రభావంతో కేసులు, మరణాలు పెరగడం ప్రారంభమైంది. 5,24,440 మంది అస్వస్థులు కాగా, మొత్తం మరణాలు 27 వరకు కొత్తగా సంభవించాయి. 2,43,630 మంది కోలుకున్నారని, 2,80,810 మంది క్వారంటైన్‌లో ఉన్నారని ఉత్తర కొరియా వెల్లడించింది. ఎన్ని జ్వరాల కేసులు, మరణాలు కరోనాగా నిర్ధారణ అయ్యాయో వివరించలేదు. కరోనా మొదటి కేసు నిర్ధారణ అయిన తరువాత గురువారం నుంచి కరోనా కట్టడి చర్యలు ప్రారంభమయ్యాయి.
- Advertisement -