Wednesday, January 22, 2025

సాధారణ ప్లూగా కరోనా మహమ్మారి….

- Advertisement -
- Advertisement -

లక్షణాలతో వెళ్లితే టెస్టులు చేయని కేంద్రాల సిబ్బంది
సీజనల్ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేస్తున్న వైద్యులు
దగ్గు, జలుబు లక్షణాలుంటే సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు
మెడిసిన్ వాడుతూ రోజు కార్యకలపాలు చేసుకోవాలని సూచనలు

Editorial about Corona Effect on Indian Economy

మన తెలంగాణ, సిటీబ్యూరో: మహానగరంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానల్లో కరోనా టెస్టులు వైద్య సిబ్బంది నిలిపివేశారు. దగ్గు, జలుబు లక్షణాలతో రోగులు వెళ్లితే సీజనల్ వ్యాధిగా గుర్తిస్తూ మందులు ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంలేదని, తాము సూచించిన మెడిసిన్ వాడితే ఆరోగ్యం కుదుట పడుతుందని వైద్యులు సూచనలు చేస్తున్నట్లు పలువురు రోగులు పేర్కొంటున్నారు.

దగ్గు, జలుబుతో పాటు వంటినొప్పులు, ఊపిరి సక్రమంగా తీసుకోకపోవడం లక్షణాలున్న వారు టెస్టులు చేయాలని కోరిన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆరోగ్య పరంగా ఇబ్బంది పడేవారు వెంటనే స్దానికంగా ఉంటే ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లుతూ పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొంటున్నారు. ఇదే అదను చూసి ప్రైవేటు ల్యాబ్ నిర్వహకులు అధిక ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇకా వైరస్ ప్రభావం తగ్గలేదని, ఈనెలాఖరు వరకు లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. థర్డ్‌వేవ్ ప్రభావం తగ్గుతుందని వైద్యశాఖ ప్రకటించిన కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.

గ్రేటర్ వ్యాప్తంగా 196 ఆరోగ్య కేంద్రాల గత రెండు నెలల నుంచి సెలవులు లేకుండా వైద్య సిబ్బంది టెస్టులు చేస్తూ వ్యాధి నిర్దారణ చేస్తున్నారు. రోజుకు 120మందికి పైగా టెస్టులు చేశారు. ఇటీవల థర్డ్‌వేవ్ ముగిసిందని ఆరోగ్యశాఖ డైరెక్టర్ పేర్కొనడంతో వైద్యసిబ్బంది ఊపిరి పీల్చుకుని ఆరోగ్య కేంద్రాలకు వస్తే కరోనా పట్ల భయపడాల్సిన పనిలేదంటున్నారు. ప్రస్తుతం రోజుకు 40 నుంచి 50మంది టెస్టుల కోసం వస్తున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నారు.

కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడంతో నగరవాసులు భౌతికదూరం పాటించకుండా, మాస్కులు సక్రమంగా ధరించకుండా ఉండటంతో లక్షణాలున్న వారి సంఖ్య కనిపిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. బస్సులు, ఆటోలు, కార్లు, మెట్రోలతో గుంపులుగా చేరుతున్నారు. అదే విధంగా విద్యాసంస్దలు కూడా ఒకేసారి ప్రారంభకావడంతో దగ్గు, జలుబు ఉన్నవారు చాలామంది ఉన్నారని, దీంతో వారి ద్వారా సమీప ప్రజలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మహమ్మారి మొదటి వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ ఆరు నెలలు, థర్డ్‌వేవ్ మూడు నెలలు నగరంపై ఉనికి చాటిందన్నారు. చలి తీవ్రత ఉండటంతో వైరస్ త్వరగా తగ్గందంటున్నారు. మరికొన్ని రోజుల పాటు కోవిడ్ నిబంధనలు నగర ప్రజలు పాటిస్తే మహమ్మారిని అంతం చేయవచ్చని బస్తీదవఖానల మెడికల్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News