హైదరాబాద్: యాదగిరిగుట్ట పోలీసుల స్టేషన్ లో కోవిడ్ కేసుల కలకలం రేగుతోంది. ఇప్పటివరకు మొత్తం 12 మందికి కరోనా వైరస్ సోకింది. ఏసిపి, సిఐ, 10 కానిస్టేబుళ్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటు హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల, రాజేందర్‌నగర్,దుండిగల్,పేట్‌బషీరాబాద్, పోలీస్‌స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషప్‌లో ఏకంగా 16 మంది పోలీసులకు కరోనా సోకింది. ఒక ఎస్‌ఐ, ఎఎస్‌ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు ఏడుగురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. అలాగే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లుకు, .పేట్‌బషీరాబాద్, దుండిగల్ పిఎస్‌లో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు కరోనా బారిన పడ్డారు. మొత్తంగా.. 35 మందికి కొవిడ్ సోకింది. వీళ్లంతా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీపెరుగున్నాయి.
యాదగిరిగుట్ట పిఎస్‌లో కరోనా కలకలం
- Advertisement -
- Advertisement -
- Advertisement -