- Advertisement -
ముంబయి: ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆమె సమీప బంధువు రచనాషా తెలిపారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌ను బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితమే చేర్చి ఐసియులో చికిత్స అందిస్తున్నారని ఆమె తెలిపారు. లతకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, అయితే ఆమె వయసురీత్యా ముందుజాగ్రత్తగా ఐసియులో చికిత్స అందిస్తున్నారని వివరించారు. నవంబర్ 2019లో కూడా లతను ఇదే ఆస్పత్రిలోని ఐసియులో చేర్చి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 28 రోజులపాటు చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. న్యుమోనియాకు ఆ సమయంలో ఆమెకు చికిత్స అందించారు. లతామంగేష్కర్‌కు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్నది. 2001లో ఆమెను దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుసహా పలు పురస్కారాలను ఆమె అందుకున్నారు.
- Advertisement -