Friday, January 24, 2025

టిపిసిసి చీఫ్ రేవంత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Corona positive for TPCC chief Revanth Reddy

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీని బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా సోమవారం వెల్లడించారు. ‘నాకు కరోనా వైరస్ సోకింది. తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్‌గా వచ్చింది. ఇటీవల నన్ను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇటీవల రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో కలవరం మొదలైంది. రేవంత్‌రెడ్డిని కలిసిన నాయకులు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తున్నారు. రేవంత్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News