Tuesday, January 21, 2025

మళ్లీ 1 శాతం దాటిన కరోనా పాజిటివిటీ రేటు

- Advertisement -
- Advertisement -

ఒక్కరోజే 3,157 కేసులు నమోదు

India Reports 2563 new corona cases

న్యూఢిల్లీ: రెండు నెలల తర్వాత దేశంలో కొవిడ్ పాజిటివ్ రేటు మళ్లీ 1 శాతం మేరకు నమోదయ్యింది. దేశంలో ఒక్కరోజే 3,157 కరోనా కేసుల నమోదు కాగా 26 మరణాలు చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,82,345 ఉండగా మొత్తం 5,23,869 మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో 408 యాక్టివ్ కేసులు పెరిగి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19,500కు చేరుకుంది. గత ఫిబ్రవరి 27న దేశంలో కరోనా పాజిటివ్ రేటు 1.11 శాతం ఉండగా మళ్లీ రెండు నెలల తర్వాత ఇప్పుడు రోజువారీ పాజిటివిటీ రేటు 1.07గా నమోదైంది. తాజాగా 26 మరణాలు చోటుచేసుకోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,23,869కి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 189.23 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ జరిగినట్లు కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News