Monday, December 23, 2024

300 జిల్లాల్లో 5 శాతం మించిన కరోనా పాజిటివిటీ రేటు

- Advertisement -
- Advertisement -

Corona positivity rate exceeding 5 percent in 300 districts

 

న్యూఢిల్లీ : దేశం లోని దాదాపు 300 జిల్లాల్లో వారం వారీ కరోనా కేసుల పాజిటివిటీ 5 శాతం మించి ఉందని, కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అత్యధిక కరోనా కేసుల రాష్ట్రాలుగా మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్ ఉన్నాయని వివరించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్ పాత్రికేయ సమావేశాన్ని ఉద్దేశిస్తూ దేశంలో డిసెంబర్ 30 నాటికి 1.1 శాతం నుంచి బుధవారం నాటికి 11.05 శాతానికి పాజిటివిటీ పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మీద కొవిడ్ కేసులు పెరిగాయని, జనవరి 10 న ఒకే ఒక్క రోజన ప్రపంచం మొత్తం మీద 31.59 లక్షలకు కేసులు పెరిగాయని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News