Saturday, November 2, 2024

వైద్యశాఖ హెచ్చరించిన కరోనా నిబంధనలు గాలికి

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల మధ్య కనిపించని బౌతికదూరం
చలి తీవ్రతతో మహమ్మారి రెక్కలు కట్టుకుంటుందని సూచనలు
ఫీజులపై ఉన్న శ్రద్ద చిన్నారులపై పెట్టడంలేదని ఆరోపణలు
విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలంటున్న విద్యార్థి సంఘాలు


మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా నిబంధనలు పాటించకుంటే థర్డ్‌వేవ్ వచ్చే వాతావరణం ఉందని వైద్యాదికారులు పలుమార్లు హెచ్చరించిన ప్రైవేటు స్కూళ్లు నిర్లక్షం చేస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను నుంచి ఫీజుల వసూలు చేయడం తప్ప వారి ఆరోగ్యంపై పెడచెవిన పెడుతున్నారని, ఇటీవల కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో వైరస్ కలకలం రావడంతో అలాంటి పరిస్దితులు రాకుండా విద్యాసంస్దలు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులు సూచించిన పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. దీపావళి పండుగ తరువాత బడుల్లో విద్యార్ధుల సందడి నెలకొనడంతో కరోనా విజృంభించే చాన్స్ ఉందని చెప్పిన వినడంలేదని, చిన్నారులంతా ఒకే దగ్గర గుంపులు చేరుతున్నారని, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే సెక్షన్లు విభజించాలని పేర్కొన, టీచర్ల తక్కువగా ఉండటంతో అందరిని ఒకే దగ్గర చేర్చి పాఠాలు వినిపిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలను బడిలో ప్రిన్సిపాల్‌కు విద్యాశాఖ అప్పగించి విద్యార్థులు ఒకే దగర్గ చేరకుండా చూడటం మాస్కులు, ప్రవేశద్వారం వద్ద శానిటైజర్, వైరస్ లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచాలని పేర్కొన్నా ఎలాంటి చర్యలు చేపట్టం లేదంటున్నారు. తమ ప్రాంతానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలతో వారానికోసారి విద్యార్దులకు టెస్టులు చేసేలా చూడాలని పేర్కొన కనీసం వారికి చిన్నారుల ఆరోగ్య పరిస్దితులపై సమాచారం తెలపడం లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలో 689 ప్రభుత్వ పాఠశాలలుండగా 1.10లక్షలమంది, 1875 ప్రైవేటు స్కూళ్లో 7.20లక్షలమంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరైతున్నారు. వీరందరు సంక్షేమంగా ఉండాలని పాఠశాల నిర్వహకులు తగిన జాగ్రత్తలు పాటిస్తే చిన్నారులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని విద్యాశాఖ పేర్కొంటుంది. వాతావరణం మార్పులతో వైరస్ విస్తరిస్తుందని, దీనికి తోడు రోడ్లపై జనసంచారం పెరగడంతో చలికాలం ముగిసేవరకు జాగ్రత్తలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను విద్యాశాఖ అధికారులు వారానికోసారి తనిఖీలు నిర్వహస్తే కరోనా నిబంధనలు యాజమాన్యాలు పాటిస్తారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News