Friday, November 22, 2024

కరోనా నివారణకు రెండేళ్లకు వేలకోట్లు ఖర్చు

- Advertisement -
- Advertisement -

Corona prevention costs billions every two years

హైదరాబాద్: జనజీవనాన్ని అతలాకుతలం చేసి.. ఎందరో ప్రాణాలను… మరెందరో ఉద్యోగాలను, ఇంకెదరో జీవితాలను అస్తవ్యస్తం చేసింది కరోనా మహమ్మారి.. వైరస్ మొదటి సంవత్సరం నామ మాత్రంగా ఉన్నా, రెండో విడత మాత్రం కరోనా ధాటికి తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి. ఎందరో అనాథలుగా మిగిలారు. కరోనా వైరస్‌ను నివారించేందతుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశంలోని రాష్ట్రాలకు కేంద్ర నుంచి రెండు సంవత్సరాలకు ఎంత ఖర్చు చేసిందని యూత్‌ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్ట కింద ప్రశ్నించగా వివరాలు అందజేసినట్లు ఆ సంస్థ్ద పేర్కొంది.

కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన కరోనా నిధులు కోట్లలో…

దేశంలోని రాష్ట్రాల వారీగా 201920, 202122 సంవత్సరాల్లో ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఒక్కసారి పరిశీలిస్తే అండమాన్ నికోబార్ (7.11) ఆంధ్రప్రదేశ్ (208.96) అరుణాచల్‌ప్రదేశ్ (63.87), అస్సాం (365.61), చండీగడ్ (2.84) ఛత్తీస్‌గఢ్ (188.03), దాద్రానగర్ హవేలి డామన్ డయ్యూ(4.76), ఢిల్లీ (15.10), గోవా (5.89), గుజరాత్ (239.61), హర్యానా (91.21), హిమాచల్ ప్రదేశ్ (108.26), జమ్ముకాశ్మీర్ (128.82), జార్ఖండ్ (191.67), కర్నాటక (252.02), కేరళ (86.94), లడక్ (31.26), లక్షదీప్ (0.74), మధ్యప్రదేశ్ (437.17), మహారాష్ట్ర (410.39), మణిపూర్ (38.67), మేఘాలయ (41.37), మిజోరం (19.93), నాగాలాండ్ (28.11), ఒడిస్సా (258.59), పుదుచ్చేరి (2.71), పంజాబ్ (99.44), రాజస్దాన్ (425.00), సిక్కిం (9.83), తమిళనాడు (239.80), తెలంగాణ (149. 34), త్రిపుర (41.86), ఉత్తరప్రదేశ్ (939.94), ఉత్తరాఖండ్ (122. 28), పశ్చిమబెంగాల్ (302.39) కోట్లు రెండు సంవత్సరాలకు అందజేసినట్లు వెల్లడించింది.

201920 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా కరోనా ఖర్చు కింద అన్ని రాష్ట్రాలకు 1113.23 కోట్లు ఇవ్వగా, 202021 సంవత్సరంలో రూ. 8147 కోట్లు నిధులు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేసినట్లు తెలిపింది. 202122 సంవత్సరంలో మొదటి విడత కింద అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొదటి విడత కింద రూ. 1827.78 కోట్లు ఇవ్వగా, అదే సంవత్సరంలో రెండవ విడత కింద రూ. 4248.17 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తం రెండు సంవత్సరాలకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు , కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి రూ. 6075.95 కోట్లు నిధులు ఇచ్చినట్లు సమాచారం హక్కు చట్టం కింద తెలిపినట్లు యాక్ సంస్థ ఫౌండర్ పల్నాటి రాజేంద్ర తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News