Thursday, December 26, 2024

వరంగల్ ఎజిఎంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

వరంగల్: కరోనా కొత్త వేరియంట్ JN-1 దేశంలో శరవేగంగా విస్తరిస్త్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్, 10 సాధారణ పడకలతో మొత్తం 50 పడకలతో ప్రత్యేక వైద్య సిబ్బందితో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశామని ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అయితే, కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కొత్త కోవిడ్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఎజిఎం ఆస్పత్రికి ఓపి విభాగం,

అత్యవసర విభాగాలలో వైద్యులు రోగులను పరిశీలిస్తున్నప్పుడు అందులో కోవిడ్ అనుమానిత ముగ్గురిని ఆర్టిఫిషర్ టెస్ట్ నమూనాలను వరంగల్ కెఎంసి వైరాలజీ విభాగానికి పంపామని తెలిపారు. అందులో RAT టెస్ట్ నెగిటివ్‌గా తేలిందని అన్నారు. బుధవారం రోజున ఆరు ఆర్టిఫిషర్ టెస్ట్ నమూనాలను పంపగా అందులో భూపాలపల్లి జిలా,్ల గణపురం మండలం, గాంధీనగర్‌కు చెందిన 65 ఏళ్ల యాదమ్మకు, రాజేందర్ అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. యాదమ్మ ఒకరినే ఇన్ పేషెంట్ ఐసోలేషన్‌లో ఉంచామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. రాజేందర్‌ను ఓపి పేషెంట్‌గా తగిన జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News