Friday, November 22, 2024

కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరం: ఈటెల

- Advertisement -
- Advertisement -

Corona second wave is dangerous

హైదరాబాద్: వైద్య సిబ్బంది 24 గంటలు నిరంతరం కష్టపడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మందులు, బెడ్స్ కొరత లేదని, రేపటి నుంచి ఆక్సిజన్, రెమెడెసివర్ కొరత ఉండదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ విషయంలో ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ పాటించాలని వైద్యులకు సూచనలు చేశారు. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, లాక్‌డౌన్, బంద్‌లు, కర్ఫూలు విధించే అవకాశం లేదని, గాలి ద్వారా వైరస్ వ్యాప్తిపై శాస్త్రీయ ఆధారాల్లేవని, కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందన్నారు.

మహారాష్ట్రలో కరోనా ఉధృతి ప్రభావం తెలంగాణపై పడిందన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశంతో రోజుకు లక్ష వ్యాక్సిన్లు వేస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలో వ్యాక్సిన్లు అయిపోయాయి, మోడీ ప్రభుత్వం సరిపడా వ్యాక్సిన్లు త్వరగా పంపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, రెమ్‌డెసివర్ ఉత్పత్తి దారులతో సిఎం కెసిఆర్ మాట్లాడుతున్నారని తెలియజేశారు. రెమ్‌డెసివర్ ఉత్పత్తి పెంచాలని సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ కోరారన్నారు. 95 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ వస్తుందని, 5 శాతం మంది కరోనా రోగులకు మాత్రమే ప్రత్యేక చికిత్స అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, అత్యవసరమైతేనే ప్రజలకు బయటకు రావాలని సూచించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. 25 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ టీకా ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఆక్సిజన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సమస్య అని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News