- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఫస్ట్‌వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారి శాంపిల్స్‌ను సిసిఎంబికి పంపించామని, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఉష్ణోగత్ర పెరిగితే కరోనా ఫస్ట్‌ఫేస్ అంతం అవుతుందని భావిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పది వేల సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తామన్నారు. రోజుకు పది లక్షల మందికైనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -