Friday, January 10, 2025

కొవిడ్ ‘లక్ష’ణాలు

- Advertisement -
- Advertisement -

Corona symptoms for 1 million people in fever survey

మూడోరోజు ఫీవర్ సర్వేలో
లక్షకు పైగా మందిలో ఆనవాళ్లు
టెస్టింగ్ సెంటర్ల వద్ద తగ్గిన రద్దీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు లక్ష మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్స్ అంద జేసినట్లు అధికారులు తెలిపారు. తీవ్ర కరో నా లక్షణాలుంటే ఆస్పత్రిలో చేర్పిస్తున్నా రు. రాష్ట్రంలో దాదాపుగా ప్రతి ఇంట్లో ఏ దో ఒక లక్షణాలతో ఉన్నట్లు సర్వేలో తేలు తున్నట్లు సమాచారం. జలుబు, దగ్గు, జ్వ రం, గొంతు నొప్పితోపాటు ఏదొక లక్షణా లతో బాధపడుతున్న వారి సంఖ్య లక్ష మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. లక్షణా లున్న ప్రతిఒక్కరికీ హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేస్తున్నారు. ఇంటింటి ఫీవర్ సర్వేలో చిన్నారులు, పెద్దవారిని విడివిడిగా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలు గుర్తించారు.కొవిడ్ తీవ్ర లక్షణాలు ఉంటే పరీక్షలు చేసి, 5 రోజుల పాటు బాధితులను సిబ్బంది ఫాలో అప్ చేస్తున్నారు. లక్షణాలు మరింత ఎక్కువ కరోనా బాధితులను వైద్య సిబ్బంది ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఫీవర్ సర్వే మరో 5 రోజులపాటు కొనసాగనుంది. రాష్ట్రంలో ఫీవర్ సర్వే ప్రారంభం కాకముందు టెస్టింగ్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించేవి. ఇప్పుడు ఇంటింటికి ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లడంతో టెస్టింగ్ సెంటర్స్ వద్ద రద్దీ తగ్గుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News