Friday, November 22, 2024

ఖాకీల్లో కరోనా టెన్షన్!

- Advertisement -
- Advertisement -

వరుసగా పాజిటివ్ బారిన పడుతున్న పోలీసులు
నగరంలో 12మంది పోలీసులకు పాజిటివ్‌లు
రోజురోజుకు పెరుగుతున్న కేసులు
బంజారాహిల్స్, పంజాగుట్ట పిఎస్‌లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
అప్రమత్తమైన ముగ్గురు సిపిలు

Corona Positive Cases in Three Police Commissionerates

 

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో పనిచేస్తున్న పోలీసుల్లో మళ్లీ కరోనా ఆందోళన కన్పిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. రోజు రో జుకు పాజిటివ్ బారినపడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. నగరంలో పనిచేస్తున్న పోలీసులకు కరోనా రావడంతో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు వెంటనే అప్ర మత్తమయ్యారు. పోలీసులు కొవిడ్ నిబంధనలు పాటించాలని అప్రమత్తం చేశారు. మాస్కులు, శానిటైజర్లు, ఇమ్యూనిటీ ట్యాబ్లెట్లు పంపించారు. బం జారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది, ఎస్‌హెచ్‌ఓతో పాటు 11 మంది కరోనా బారినపడ్డారు.

ముందుగా ఐదుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారినపడగా తర్వాత నలుగురు, ఇప్పుడు ఎస్‌హెచ్‌ఓతోపాటు మ హిళా ఎస్సై కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలక్‌నూమా ఇన్‌స్పెక్టర్ కూడా కరోనా బారినపడ్డట్లు తెలిసింది. దీంతో కరోనా పాజిటివ్ సెకండ్ వేవ్‌పై ప్రజలతోపాటు పోలీసులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమకు కూ డా పాజిటివ్ వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్లలో పనిచేస్తున్న పోలీసులది ఇదే పరిస్థితి ఉంది. గత ఏడాది కేవలం లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులు మాత్రమే కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తి వేయడంతో జిహెచ్‌ఎంసి పరిధిలోని జనాలు రోడ్లపైకి వచ్చి వారి పనులు చేసుకుంటున్నారు.

దీంతో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియడంలేదు. పోలీసులకు విధులు నిర్వర్తించడం తప్పదు కనుక వాహన తనిఖీల సమయంలో కరోనా పాజిటివ్ ఉన్న వారి నుంచి వచ్చే అవకాశం ఉంది. దీంతో తమకు కూడా వస్తుందేమోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల రక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు పో లీసుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయడంతోపాటు పోలీస్ స్టేషన్లలో సానిటైజర్లు, మా స్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. తప్ప నిసరిగా పోలీసులు వీటిని పాటించాలని కోరారు. మూడు కమినరేట్లలో పోలీసు సిబ్బంది కొరత ఉంది, దానికితోడు వరుసగా కరోనా బారిన పడుతుండడంతో విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారింది. గత ఏ డాది మూడు పోలీస్ కమిషనరేట్లలో దాదాపు 300మంది వరకు పోలీ సులు కరోనా బారిన పడ్డారు. గతంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన పోలీసులతో కరోనా పాజిటివ్ కేసులు మొదలయ్యాయి. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేయ డంతో పోలీస్ స్టేషన్లకు బాధితులు వస్తున్నారు. అందులో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియదు కాబట్టి పోలీసులు మరింత జాగ్రత్తగా ఉం డాల్సి ఉంది.

పోలీసులకు సెకండ్ వేవ్ టెన్షన్…

నగరంలోని పోలీసులు కరోనా విజృంభిస్తుండడంతో ఆం దోళన చెందుతున్నారు. గతంలో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు రెండో సారి క రోనా బారిన పడడంతో చాలా టెన్షన్ పడ్డారు. ఇప్పుడు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న పోలీసులు తాము రెండోసారి కరోనా బారిన పడుతామని ఆందోళన చెందుతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది 11మందికి కరోనా పాజిటివ్ రా వడంతో మిగతా పోలీసులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది 50మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది నగరంలో అత్యధికం, ఇప్పుడు కూడా వస్తుందేమోనని భయ పడుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పోలీసులు జా గ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు, వాటర్ బాటిళ్లు, విటమిన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News