Wednesday, January 22, 2025

బస్తీదవాఖానల్లో తగ్గుతున్న కరోనా టెస్టులు

- Advertisement -
- Advertisement -

టినేజర్ల వ్యాక్సిన్ విధుల్లో వైద్య సిబ్బంది
పరీక్షల కోసం గంటల తరబడి రోగులు ఎదురుచూపులు
రోజంతా డజన్ మందికి కూడా టెస్టులు చేయని పరిస్దితి
ఔట్‌సోర్సింగ్ ద్వారా మరికొంతమంది సిబ్బంది నియమించాలి
ఉన్న తక్కువ సిబ్బందితో టెస్టులు, టీకా వేయలేమంటున్న మెడికల్ అధికారులు

Corona test decreased in Basti dawakhana

మన తెలంగాణ,సిటీబ్యూరో :  నగరంలో కరోనా వైరస్ విజృంభణతో స్దానిక ప్రజలు టెస్టులు చేయించుకునేందుకు సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు, బస్తీదవఖానలకు వెళ్లుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉండటంతో వ్యాధి తెలుసుకోవడానికి వెళ్లితే కేంద్రాల సిబ్బంది టినేజర్ల టీకా కార్యక్రమంలో ఉండటంతో చాలామంది వెనుదిరిగిపోతున్నారు. గంటల తరబడి వేచిచూసిన ఆసుపత్రుల సిబ్బంది టెస్టులు వైపు రావడంలేదని పేర్కొంటున్నారు. ఒక పక్క ర్యాపిడ్ టెస్టులు, మరోపక్క టీకా పంపిణీతో ఇబ్బందులు పడుతున్నామని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ప్రారంభించడంతో త్వరగా పంపిణీ పూర్తి చేసేందుకు వైద్యశాఖ చర్యలు చేపట్టింది.

పండగ తరువాత థర్డ్‌వేవ్ వచ్చే వాతావరణం ఉందని భావిస్తూ నగరంలో 5.50లక్షలమంది యువతకు టీకా ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి చేస్తామని చెబుతున్నారు. దీంతో కరోనా టెస్టులు విషయంలో కొంత జాప్యం జరుగుతుందని, వైద్య సిబ్బంది సరిపడ లేకపోవడంతో రెండు వైపులా విధులు నిర్వహించాలంటే కష్టంగా ఉందని, వైద్యశాఖ ఉన్నతాధికారులు ఔట్‌సోర్సింగ్ పద్దతిలో కొంతమంది సిబ్బందిని తీసుకోవాలని కోరుతున్నారు. మొన్నటివరకు రోజుకు 25మందికి టెస్టులు చేయగా, ప్రస్తుతం డజన్ మందికి కూడా చేయడంలేదు.దీంతో సామాన్య ప్రజలు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించే పరిస్దితి నెలకొనంది.

ఇదే అదనుగాబావించిన డయాగ్నస్టిక్ సెంటర్లు 10 రకాలు టెస్టులు చేస్తూ రూ. 3500వరకు దోచుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి కరోనా రెచ్చిపోతూ 300 పాజిటివ్ కేసులకు చేరింది. టెసుల సంఖ్య పెంచి 15 రోజుల పాటు నగరంలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తే వైరస్ సోకిన వారిని గుర్తించి, లక్షణాలున్న ఎక్కువ ఉన్నవారిని ఆసుపత్రికి స్వల్ప లక్షణాలున్న వారిని హోంక్వారంటైన్ చేస్తే మహమ్మారి వేగానికి కళ్లెం వేయవచ్చని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వైరస్ లక్షణాలున్న ఉన్నవారికి పరీక్షలు చేయకపోతే వారు బయట తిరగడం వల్ల ఇతరులకు సోకే ప్రమాదముందని అందుకోసం ప్రభుత్వ ఉన్నతాధికారులు వైద్య సిబ్బందిని పెంచి టెస్టులు గ్రేటర్ పరిధిలో రోజుకు 10వేల మందికి చేసేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. అదే విధంగా ప్రజలు లక్షణాలుంటే మాస్కులు ధరించి, అత్యవసర పరిస్దితుల్లో బయటకు వెళ్లాలని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News