న్యూఢిల్లీ : ఒమిక్రాన్ భయంతో విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు అధికారులు ఆర్టీ పీసీఆర్ వంటి కొవిడ్ పరీక్షలు చేస్తున్నా ఫలితాలు రాడానికి చాలా సమయం పడుతోంది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ ఫలితాలు త్వరగా వచ్చేలా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగం ఆర్‌టీలాంప్ అనే కొవిడ్ కిట్‌ను రూపొందించింది. నిపుణులు అవసరం లేకుండా సులభంగా ఈ కిట్‌తో కరోనా పరీక్షలు చేయవచ్చని, ఫలితాలు అరగంట లోపే వస్తాయని ఐసీఎంఆర్ పేర్కొంది. ఇంతర కొవిడ్ పరీక్షల కంటే ఈ ఆర్‌టిలాంప్ పరీక్షకు 40 శాతం తక్కువ ఖర్చు అవుతుందని తెలియచేసింది. వీటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి ఢిల్లీ, చెన్నైల్లోని అనేక కంపెనీలకు నమూనాలు పంపించామని , మరో రెండు వారాల్లో ఈ కొత్త కొవిడ్ కిట్ అందుబాటు లోకి వస్తుందని వివరించారు. విమానాశ్రయాలతోపాటు ఓడరేవులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల్లో ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు ఇవి ఉపయోగమౌతాయని ఐసీఎంఆర్ తెలియచేసింది.
ఐసిఎంఆర్ కొత్త కొవిడ్ కిట్ … 30 నిమిషాల్లో ఫలితాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -