Saturday, September 21, 2024

ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

 Imran Khan

 

ఇస్లామాబాద్ : గతవారం తాను కలిసిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అలాగే, కరోనా పరీక్షల కోసం ఆయన నుంచి వైద్యులు శాంపిళ్లు సేకరించారు. వాటి ఫలితాలు బుధవారమే వచ్చే అవకాశం ఉందని ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ తెలిపారు. ఇమ్రాన్ ఈనెల 15 వ తేదీన ఇస్లామాబాద్‌లో ప్రముఖ దాత, ఎది ఫౌండేషన్ చైర్మన్ ఫైసల్ ఎదిని కలిశారు.ఈ సందర్భంగా ఎది, కరోనా వైరస్ సహాయనిధి కోసం రూ. 10 మిలియన్ల చెక్‌ను ప్రధానికి అందజేశారు. ఇమ్రాన్‌ను కలిసిన కొద్ది రోజులకే ఎదిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. లక్షణాలు 4 రోజుల పాటు ఉండడంతో ఆయనకు పరీక్షలు చేయగా, కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దాంతో, అప్రమత్తమైన ఇమ్రాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లి, కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఇమ్రాన్ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే ప్రభుత్వాన్ని ఆయన ఎలా నడిపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

Corona tests to Pakistan PM Imran Khan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News