- Advertisement -
ముంబై: తాను, తన భార్య ప్రియ రుంచల్ కరోనా వైరస్ బారినపడినట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న తమకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. వైరస్ బారినపడిన నాటి నుంచి తాము హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నట్లు 49 ఏళ్ల జాన్ అబ్రహం సోమవారం ఇన్‌స్టామ్ గ్రామ్ ద్వారా వెల్లడించారు. మూడు రోజుల క్రితం తాము ఒక వ్యక్తిని కలుసుకున్నామని, ఆ వ్యక్తికి కొవిడ్-19 ఉన్నట్లు తమకు తర్వాత తెలిసిందని ఆయన తెలిపారు. తాను, తన భార్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు. తామిద్దరం రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నామని, తమకు వైరస్‌కు సంబంధించి స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తాము ఎవరినీ కలుసుకోకుండా హోం క్వారంటైన్‌లో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -